అక్రమ మద్యం తరలింపు కేసు సెబ్ యస్ ఐ విజయకుమార్ ను సస్పెండ్ చేసిన డి.సి...
0 Comments । By Black Cat News । 30 March, 2023

ఎమ్మిగనూరు సెబ్ యస్ ఐ సస్పెండ్
అక్రమ మద్యం తరలింపు కేసు సెబ్ యస్ ఐ విజయకుమార్ ను సస్పెండ్ చేసిన డి.సి..
ఈనెల 20వ తేదీన కర్నాటక నుంచి అక్రమంగా కారులో మద్యం తీస్తుండగా కర్నూలు సరిహద్దులో పోలీసుల తనిఖీలో పట్టుబడిన కారు.
ఎమ్మిగనూరు యస్ ఐ విజయకుమార్ ఈ అక్రమ మద్యం తరలింపు లో పాత్ర ఉన్నట్లు తెలిసింది.
ఉన్నత అధికారాలు ఆదేశాల మేరకు పోలీసులు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి జైలు కు పంపినారు.
ఈ విషయం పై పెద్ద దుమారం రేపింది.
దీనితో సరిహద్దు సిరిగుప్ప పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత అధికారాలు డి.సి.కి నివేదిక అందజేశారు.
ఈ మేరకు డిసి సెబ్ యస్ ఐ విజయకుమార్ ను సస్పెండ్ చేశారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool