×
Login

ఒకే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో మూడు బైపాసు సర్జరీలు.

0 Comments । By Black Cat News । 1 April, 2022

ఒకే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో మూడు బైపాసు సర్జరీలు

**ఒకే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో మూడు బైపాసు సర్జరీలు - బయోమెట్రికి భయపడేదేల్యా.. మిషన్లు పగిలిపోవాల**


*కిష్టప్ప అనే 70 ఏళ్ళ వ్యక్తిక ఛాతి నొప్పితో ఆసుపత్రి కి వచ్చాడు,,* ఆంజియోగ్రాము చేస్తే బైపాస్ చేయాలని వచ్చింది., రోజు రాత్రి నొప్పి అని బాధపడుతున్నాడు,. ఈ రోజు బీటింగు హార్ట్ సర్జరీ పద్ధతిలో బైపాసు సర్జరీ చేయడం జరిగింది..


*సంతోషమ్మ అనే 60 ఏళ్ళ మహిళ రక్తహీనతతో ఆసుపత్రి కి వచ్చింది..* పరీక్షలు లో బైపాసు 3 గ్రాఫ్టు చేయాలన్నారు.. రెండు బాటల్ల రక్తం ఎక్కించి పంపు లో బైపాసు సర్జరీ చేయడం జరిగింది...


*లక్ష్మి దేవి అనే 30 ఏళ్ళ మహిళ హార్ట్ ఫెయిల్యూరు తో వచ్చింది,,* దానికి వైద్యం చేయడం అయినాక మిగతా పరీక్షలు లో మైట్రల్ వాల్వు మార్చాలని తేలింది..  మైట్రల్ వాల్వు మార్చడం జరిగింది...


*ఈ ముగ్గురూ ఆసుపత్రి లో చేరారు.. కాని మత్తుమందు వైద్యులు బదిలీపై పోవడం వలన ఆపరేషన్ చేయలేక పోయాము.*.వీరు ఇంటికి వెళ్ళి మరలా రమ్మంటే వెళ్ళేదే లేదని మొండిగా ఉన్నారు.. ఇద్దరికీ రాత్రిల్లు నొప్పి వస్తోంది.. *ఈ రోజు కొండారెడ్డి మత్తుమందు డాక్టరు అనంతపురం నుంచి వచ్చింటే ఇక వేరే దారిలేక ముగ్గురికీ చేసాము.. ఒక ప్రభుత్వ ఆసుపత్రి లో ఒకరిచేయడమే కష్ఠం ... అటువంటిది మానవతా దృక్పధంతో చేయాల్సి వచ్చింది..*


*ముగ్గురికీ ఆపరేషన్ సక్సెస్ అయింది..*. కిష్టన్నకు వెంటిలేటరు కూడా తొలగించారు... రేపు కూడా ఆయన వస్తే ఇంకొక కేసు చేస్తే అన్నీ అయిపోతాయి,.


*ఇంతకుముందు రెండేళ్ళ క్రితం ఇలా 3 ఆపరేషన్లు చేసాము.... సింగిల్ వైద్యులుగా 3 బైపాసు సర్జరీ లు ఏకబిగిన ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు చేయడం కొంచెం శ్రమే,. కాని తప్పలేదు.. అడ్మిట్ చేసుకున్నాము,, నొప్పి నొప్పి అంటే చూస్తూ ఉండలేము కదా...ఇందుకు సహకరించిన రమేష్ పర్ఫ్యూజనిష్టు కు, మా నర్సింగు మరియు నాలుగవ తరగతి సిబ్బంది టైమయిపోయింది అనకుండా ఇంతవరకూ కష్ఠపడ్డారు.. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పని చేయరు అనుకుంటారు.. ఇలా ఓవర్ టైము చేస్తారు..బయోమెట్రీలకు భయపడేదేల్యా... మిషన్లు పగిలిపోవాల్సిందే...*


Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool




Also Read

×