×
Login

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్‌ అభినందనలు.

0 Comments । By Black Cat News । 5 April, 2022

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్‌ అభినందనలు

_కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్‌ అభినందనలు._*

_విజయవాడ: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×