×
Login

మహిళలు అధైర్యపడొద్దు.. మహిళలు దైర్యంగా ఉండండి - ఎస్ పి..

0 Comments । By Black Cat News । 10 June, 2022

మహిళలు అధైర్యపడొద్దు.. మహిళలు దైర్యంగా ఉండండి - ఎస్ పి.


సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. ఆపద సమయంలో పోలీస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా హక్కులతోపాటు బాల్యవివాహాల నివారణ, గృహహింసకు వ్యతిరేకంగా గురువారం మెదక్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  విద్యతో పాటు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్‌, మాటలను నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియా కి దూరం ఉంటే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. భద్రత కల్పించడానికి ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటామనీ భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో షీటీం, 1098, డయల్‌ 100 వంటి అత్యవసర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అంతకుముందు పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్పీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఠాణా నుంచి పాతబస్టాండ్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు, సీఐలు మధు, విజయ్‌, ఎస్సైలు మోహన్‌రెడ్డి , మల్లయ్య పాల్గొన్నారు.

పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి అని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించానికి కృషి చేయాలని ఎస్పీ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో పోలీసు అధికారులతో నేరాల తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఠాణాలో విచారణలో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతోపాటు డీఎస్పీ యాదగిరిరెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ నారాయణరెడ్డి, ఐటీ కోర్‌ ఎస్సై సందీప్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Santosh Kumar 's Report
BlackCatNews, Medak




Also Read

×