×
Login

మేకతో యువకుడి పెళ్లి... నూజివీడు పట్టణ పరిధిలో.............

0 Comments । By Black Cat News । 4 April, 2022

మేకతో యువకుడి పెళ్లి...   నూజివీడు పట్టణ పరిధిలో............

ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా ఏదో ఒక చోట ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.జ్యోతిష్యం పేరుతో వింత పోకడలకు పోతున్నారు.జాతకం ప్రకారం ఓ యువకుడి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని,దోష నివారణ కోసం మేకతో పెళ్లి జరిపించారు.ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది.

నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు.అతడి జాతకాన్ని పరిశీలించేందుకు జోతిష్యుడిని సంప్రదించారు.ఆ కుర్రాడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని ఆయన వారికి వివరించారు.ఆ దోషం పోవాలంటే మేకను మనువాడితే సరిపోతుందని సూచించాడు.దీంతో జాతకాలపై నమ్మకమున్న ఆ యువకుడు మేకతో వివాహానికి రెడీ అయిపోయాడు.

నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో ఈ కుర్రాడికి మేకతో పెళ్లి జరిగింది.ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు.మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు.స్థానికులు మాత్రం మేకతో పెళ్లా అంటూ ఆశ్చర్యపోయారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×