×
Login

ఆ ఊళ్లో దేవుడికి కాదు.. మహాత్మా గాంధీకి పూజలు చేస్తారు.. కారణం ఏంటో తెలుసా?.

0 Comments । By Black Cat News । 25 July, 2023

ఆ ఊళ్లో దేవుడికి కాదు.. మహాత్మా గాంధీకి పూజలు చేస్తారు.. కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని లేదా పంటలు బాగా ఉండాలని విల్లేజిల్లో గ్రామ దేవత ఉత్స వాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మేళతాళాలతో ఊరు ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి ముర్రాటలు, బోనాలు సమర్పించుకుంటారు. కానీ శ్రీకాకుళo జిల్లా పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ పేరుతో జాతిపిత మహాత్మా గాంధీని గ్రామ దేవతగా కొలుస్తారు.

అనాదిగా వస్తున్న ఆచారం..
కరెన్సీ నోటు పైనో, పోస్టల్ స్టాంప్ పైనొ కనిపించే గాంధీ.. జయంతికో, వర్ధంతికో భరత జాతి మొత్తం నివాళులర్పిoచి గౌరవించుకునే ఆ మహాత్ముడు కేదారిపురం గ్రామస్తులకు మాత్రం ఓ దేవుడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గ్రామములో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా అషాడ మాసం ముగుస్తుందనగా గురువారం రోజున గాందీ ఉత్సవం నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ ఉత్సవం నిర్వహించాకే ఖరీఫ్ కి సంభందించి వరి ఉడుపులు ప్రారంభిస్తారు.

కానరాని జంతు బలి..
సాధారణంగా గ్రామ దేవత ఉత్సవాలు అంటే జంతు బలులు కీలకం. పెద్ద సంఖ్యలో కోళ్లు, మేకలు, గొర్రెలు తలలు తెగి, రక్తం ఏరులై పారుతుంది. కానీ ఈ ఉత్సవంలో మాత్రం అటువంటిదేమీ కనిపించదు. మహాత్మ గాంధీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే ఈ పండగ కొనసాగుతుంది. గాందీ ఉత్సవం రోజున పిల్లా పాపలతో ఊరు ఊరంతా కదులుతుంది. మేలతాలాలు, నృత్యాలతో గ్రామస్తులందరూ ఊరేగింపుగా గ్రామం నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆరోజు గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. గాంధీ విగ్రహం ముందు మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పెట్టి దాని ముందు వెదురు బుట్టలో గాంధమ్మ చెక్క బొమ్మలను పెట్టీ పూజలు చేస్తారు. బోనాలు, ఫలాలు, ముర్రాటలు గాంధమ్మకు సమర్పించుకుంటారు. వడప్పపు, పానకం వంటివి నైవేద్యంగా పెట్టీ దీప ధూపాలతో పూజలు చేస్తారు. గాందమ్మా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ కోలాటాలు, భజనలు చేస్తారు. కేదారిపురం గ్రామం ప్రతి ఏటా ఖరీఫ్ పనులు ఆరంభించడానికి ముందు ఊరంతా కలిసి గాంధమ్మకు పూజించి సేధ్యం చేయటం ఇక్కడ ఆనవాయితీ.


CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Srikakulam



#

Also Read

×