×
Login

అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతాం :చంద్రబాబు......

0 Comments । By Black Cat News । 5 April, 2022

అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతాం :చంద్రబాబు.....

*అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతాం :చంద్రబాబు*


*అమరావతి :*

*ఏపీలో అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు.*

*సోమవారం పార్టీ నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.*

*విద్యుత్ చార్జీల పెంపు, పన్నుల భారంపై 'బాదుడే బాదుడు` పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తామని చెప్పారు. కరెంటు ఎందుకు పోతోందో, బిల్లులు ఎందుకు పెరిగాయో సీఎం చెప్పాలని నిలదీశారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే..*

*రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. అమరావతిలో 80 శాతం జరిగిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.*

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×