సిబిఐ దర్యాప్తు జరిపించి మా నిధులు మాకు ఇప్పించండి.......
0 Comments । By Black Cat News । 10 August, 2023

సిబిఐ దర్యాప్తు జరిపించి మా నిధులు మాకు ఇప్పించండి – ఆం. ప్ర సర్పంచుల సంఘం మరియు ఆం. ప్ర పంచాయతీరాజ్ ఛాంబర్
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా పంపిన గ్రామపంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించడంపై సిబిఐ దర్యాప్తు జరిపించి మా నిధులు మాకు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి. బి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావుల నేతృత్వంలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు.
ఈ సందర్భంగా కపిల్ మోరేశ్వర్ గారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘాల ద్వారా నిధులు పంపిస్తుందని, వాటిని దారి మళ్ళించడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది సర్పంచులు వచ్చి ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు కనుక తప్పకుండా మీ సమస్యలపై ఒక కమిటీ వేసి ఉన్నత స్థాయి విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తానని కపిల్ మోరేశ్వర్ గారు అన్నారు.
కపిల్ మోరేశ్వర్ గారిని కలిసిన వారిలో పార్లమెంట్ సభ్యులు కనకమెడల రవీంద్రనాథ్ గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ మరియు టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి, సిపిఐ, ఇతర పార్టీలకు చెందిన 100 మంది సర్పంచులు ఉన్నారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna