కాజులూరు స్త్రీశక్తి భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన.
0 Comments । By Black Cat News । 16 March, 2023

ఏపిఎం ఆగడాలపై.. మండిపడ్డ వివోఏలు
కాజులూరు స్త్రీశక్తి భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన.
ఏపీఎంపై చర్యలు తీసుకుని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయు నాయకులు డిమాండ్.
కాకినాడ జిల్లా
కాకినాడ రూరల్ ఏపిఎం ఆగడాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అకారణంగా తొలగించిన కాజులూరు మండల వీఓఏ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయు నాయకులు గంగా భవాని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా, కాజులూరు మండల కేంద్రం స్త్రీశక్తి భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఏలు బుధవారం ధర్నా చేపట్టారు. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీఎంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా గంగా భవాని మాట్లాడుతూ అకారణంగా తొలగించిన కాజులూరు-5 మందపల్లి దివ్య జ్యోతి, మంజేరు-2 పీ.గౌరీ, కుయ్యేరు-2 పిల్లి నూకరత్నం, చేదువాడ పెంకె గంగాభవాని, టి మామిడాడ టి.దుర్గా భవాని, తల్లంపూడి పి. సత్యనారాయణ లను ఏ కారణం లేకుండా తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అడిగితే మోకాళ్లు వేసి మొక్కాలంటూ వ్యంగ్యంగా మాట్లాడారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సంఘాల నుంచి తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని, ఏపిఎం అడిగిన డబ్బులు తాము ఇవ్వలేదని ఒక్క కారణంతోనే తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు పది నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, తమను విధుల్లోకి తీసుకోవాలని అడిగితే తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని ఏపీఎం బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని, మానసిన ఒత్తిడికి గురి చేస్తున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, East Godavari