×
Login

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న మహామృత్యుంజయ యాగం ఆధ్యాత్మిక అమృతవాహిని..

0 Comments । By Black Cat News । 11 June, 2021

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న మహామృత్యుంజయ యాగం ఆధ్యాత్మిక అమృతవాహిని.

సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో విశ్వమానవ శ్రేయస్సు కోసం చేపట్టి నిర్వహిస్తున్న మహామృత్యుంజయ యాగం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. శుక్రవారం 33 వ రోజుకు చేరుకున్న మహామృత్యుంజయ యాగంలో ఈరోజు ఉదయం గోపూజ శివాలయంలో రుద్రాభిషేకం, అఖండ జలాభిషేకం, మృత్యుంజయ జపం కి అనుగుణంగా దశాంశ మృత్యుంజయ హోమం హవనము, పూర్ణాహుతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన మహా మృత్యుంజయ యాగానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యాసంస్థలు ఆర్ ఎల్ ఆర్ ఆది నేత డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు మునుపు ఆయనకు ఆలయ ముఖ ద్వారం ముందు మర్యాదపూర్వకంగా రాజ గోపురం వద్ద పూర్ణకుంభం తో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 180 అవధూత మహారాజ్, ఆశ్రమ భావి పీఠాధిపతి సిద్దేశ్వరానంద గిరి మహారాజ్ పూలమాల శాలువాతో లక్ష్మారెడ్డి గారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఆనంద గిరి నందిని గిరి మాత, కోట ఆశన్న దంపతులు పాల్గొన్న కార్యక్రమంలో యజ్ఞం వైదిక పండితులు దత్తస్వామి నేతృత్వంలో కొనసాగింది.

Santosh Kumar 's Report
BlackCatNews, Medak




Also Read

×