×
Login

వరుస ఛోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అదుపులో..

0 Comments । By Black Cat News । 4 May, 2023

వరుస ఛోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అదుపులో.

వరుస ఛోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

92.5 గ్రా" బంగారం, 700గ్రా" వెండి స్వాధీనం

సత్యవేడు పోలీస్టేషన్ పరిధిలో వరుస ఛోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుత్తూరు డిఎస్ఫీ శ్రీనివాస రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఛోరీల కేసును ఛేదించే దిశగా సిఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, తమ సిబ్బందితో కలిసి ముమ్మరంగా ధర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు.

ధర్యాప్తు లో భాగంగా బుధవారం మండల సరిహద్దు ప్రాంతంలోని RVR వే బ్రిడ్జి వద్ధ వాహన తనిఖీలు చేపట్టగా తమిళనాడు నుండి ఆంధ్రాకు ఆటోలో వస్తున్న భాషా(23) అనే వ్యక్తిని అదుపులోకి విఛారించగా తానే సత్యవేడు, సిరనంబుదూరులో ఛోరీలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు.

నిందితుడు స్ట్రీట్ -9జె.జె నగర్, కొరిక్ పేట, చెన్నై కి చెందిన గని కుమారుడు,మాభాషా అలియాస్ భాషా(23)గా తెలిసిందన్నారు.

దీంతో పోలీస్ లు నిందితుడిపై కేసు నమోదు చేసి, అతని వద్ధ నుంచి 92.5 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ"3,58,000 ఉంటుందని డిఎస్పీ తెలిపారు.

నిందితుడు ఇదివరకే పాతకేసుల్లో ముద్ధాయిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని సైదాపురం, గూడూరు, మనుబోలు, చిట్టమూరు, ఓజిలి పెళ్ళకూరు పోలీస్టేషన్ లలో, తమిళనాడు కొరిక్ పేటలో నిందితుడిపై కేసులు నమోదు కాగా జైలుకి కూడా వెళ్ళివచ్చినట్లు డిఎస్పీ పేర్కోన్నారు.

అంతర్రాష్ట్ర దొంగ ను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, ఎఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్, కానిస్టేబుల్ లు హనుమంతయ్య, నరేష్ కుమార్, కుప్పారావు, ఎ.శివ, ఆర్.శివ లను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor



#

Also Read

×