×
Login

అప్పుల బాధతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య గ్రామంలో విషాద ఛాయలు.

0 Comments । By Black Cat News । 11 June, 2022

అప్పుల బాధతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య గ్రామంలో విషాద ఛాయలు

అప్పుల బాధతో ఓ మాజీ సర్పంచ్ పురుగుల మందు తాగి ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బిట్ల నర్సింలు గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ఎలాంటి ఆస్తులు సంపాదింకోకపోవడమే కాకుండా కుటుంబాన్ని పోషించేందుకు తిరిగి అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చేందుకు గ్రామంలో ఎలాంటి మార్గం లేకపోవడంతో ఎలాగైన అప్పులు తీర్చాలని దుబాయ్ వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. నాలుగు సంవత్సరాలు దుబాయ్ వెళ్లిన చిల్లిగవ్వ సంపాదించకపోవడంతో మరింత అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక ఒక మాజీ సర్పంచ్‌గా నలుగురిలో పరువు పోతుందనే మనస్థాపానికి గురై నర్సింలు ఆదివారం పురుగుల మందు సేవించాడు.

కుటుంబీకులు వెంటనే సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. అందరితో కలుపుగోలుగా ఉండే నర్సింలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతునికి ఒక భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నర్సింలు మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబాని అన్ని విధాలా అండగా ఉంటామని సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు.


Santosh Kumar 's Report
BlackCatNews, Medak



#

Also Read

×