నారాయణవనం పరిధిలో సుమారు కోటి రూపాయలు విలువచేసే 25 ఎర్రచందనం,బొలెరో పట్టివేత. .
0 Comments । By Black Cat News । 21 March, 2023

తిరుపతి జిల్లా...
పుత్తూరు సబ్ డివిజన్ నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు కోటి రూపాయలు విలువచేసే 25 ఎర్రచందనం దుంగలు, ఒక బొలెరో వాహనం పట్టివేత
చాకచక్యంగా వ్యవహరించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ఎర్రచందనం ప్రభుత్వ సంపదని వీటిని దొంగలించడానికి ఎవరు ప్రయత్నించినా, వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని, ఇట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, జిల్లా నుండి బహిష్కరణ చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు గట్టిగా హెచ్చరించారు
తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్ నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8:30 గంటలకు నారాయణవనం ఎస్ఐ మరియు వారి సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా పుత్తూరు వైపు నుండి నారాయణవనం వైపు ఒక బొలెరో వాహనం వస్తూ ఉండటాన్ని గమనించిన పోలీసు వారు వెంటనే అప్రమత్తమై, వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు వారు రోడ్డుకు అడ్డంగా ఉండటాన్ని గమనించిన వాహనం మరింత వేగం పెంచే ప్రయత్నం చేసి తప్పించుకోవాలని చూశారు, కానీ పోలీసులు యొక్క వ్యూహం ముందు అది కొనసాగలేదు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వాహనంతో పాటు ఒక ముద్దాయిని అరెస్టు చేసి, సుమారు 98 లక్షల విలువచేసే మేలు రకం 25 ఎర్రచందనం దుంగలను, 5 లక్షల విలువచేసే బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒక ముద్దాయి పారిపోగా పట్టుబడిన ముద్దాయిని వివరాలు అడగగా తన పేరు మరుదు పాండి వెళ్ళస్వామి వయసు 44 తండ్రి వెల్లస్వామి డోర్ నెంబర్ వన్1/447A, మొదటి వీధి, అతన్ తంగళ్, బాల గణేషన్ నగర్, షోలవరం తాలూకా, తిరువల్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం అని తెలిపారు.
పారిపోయిన ముద్దాయి ప్రధాన నిందితుడని ఇతను శేషాచలం అడవిలో ఎర్రచందనం చెట్లను కూలీల సహాయంతో నరికి వాటిని బెంగళూరు, చెన్నై లో గల ప్రధాన స్మగ్లర్లకు అమ్ముతుంటాడని పట్టుబడిన డ్రైవర్ మరుదు పాండి వేళ్ళ స్వామి వెల్లడించాడు.
కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు ఈ రోజు రేణిగుంట ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్., గారు మాట్లాడుతూ జిల్లాల్లో అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని వెల్లడించారు.
తిరుపతి పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధిగాంచినట్టు, మేలురకమైన ఎర్రచందనానికి కూడా శేషాచలం అడవులు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఎర్రచందన స్మగ్లర్లు రకరకాల వ్యూహాలతో అక్రమ రవాణా చేయడానికి వారికి తగిన మార్గంలో వెళుతున్నారని, వీటిని జిల్లా వ్యాప్తంగా అరికట్టడానికి ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా అక్రమ రవాణా అరికట్టడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్మగ్లర్లు ఎంత తెలివిగా ముందుకు వెళ్లినా, పోలీసుల ముందు వారి వ్యూహం కుదరదని, మేము అత్యంత వ్యూహంతో పకడ్బందీగా అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.
అక్రమ రవాణాకు పాల్పడినా, సహకరించినా అట్టివారిపై కూడా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అక్రమ రవాణాపై ఏదైనా సమాచారం ఉంటే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ డయల్ 100 కు కానీ సమాచారం ఇచ్చి, సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం చాకచక్యంగా వ్యవహరించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, విలువైన ఎర్రచందనం దుంగలను, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ముద్దాయిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు రివార్డు లు ప్రకటించి, అందజేసి, అభినందించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లు శ్రీ వెంకట్రావు అడ్మిన్, శ్రీ కులశేఖర్ L&O, శ్రీమతి విమల కుమారి క్రైమ్, పుత్తూరు డిఎస్పి రామరాజు, పుత్తూరు రూరల్ సిఐ సురేష్ కుమార్, నారాయణవనం, వడమాల పేట ఎస్సైలు మరియు నారాయణవనం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor